ప్రియమైన సహోదర / సహోదరిలకు,
మన ప్రభువును , రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనములు ....
గడచినా కాలమంతా దేవుడు నన్ను నా కుటుంబంను తన రెక్కల చాటున కాచి కాపాడి ఉన్నారు.అయన మహా కృపను బట్టి మీము దేవునిలో ఆనందించుతున్నాం. ముక్యంగ దేవుడు నా పట్ల చేసిన కార్యములను వివరించలేను , అవి అద్బుతములు. నా సాక్ష్యం మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్న .
నా పేరు మోషే (మోహన్ ), తండ్రిగారు జాన్ పాల్ తల్లిగారు శాంతారత్నం ,నాకు ముగ్గురు అక్కలు, మా తల్లితండ్రులుకి నేను ఒక్కడనే కుమారుడిని ,మా నాన్నగారు NAVAL DOCKYARD లో ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు , అమ్మ ఇంటిలోనే ఉండేవారు , మా తల్లితండ్రులు ప్రార్ధన పరులు గనుక మా ఇంటిలో ఎప్పుడు కుటంబ ప్రార్ధన ఉండేది . ప్రతి దినం మీము అందరం కలసి దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళం. మా ముగ్గురు అక్కలకు వివాహం జరిగింది , ఇప్పుడు వాళ్ళు ,వాళ్ళ కుటుంబాలు దేవునిలో ఆశ్విరదంచాబడుతున్నారు . మా తల్లితండ్రులు మమ్మలను మంచి విశ్వాసంలో పెంచారు . చిన్ననాటి నుండి మేము దేవుని పట్ల భయభక్తులతో వినయ విదేయత తో పెరిగాం . ప్రతి దినం కుటుంబ ప్రార్ధనలో మా తండ్రి గారు మాకు వాక్యం ఉపదేశించావారు. ఏ ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండ కుటుంబ ప్రార్ధన చేసుకునే వాళ్ళం. మా దైవజనులు పాస్టర్ జి .డేవిడ్ గారు సంఘంలో మేము ,ఇంకా అనేక కుటుంబాలు దేవుణ్ణి భక్తీ శ్రధలతో ఆరాధన చేసేవాళ్ళం .ఆ దినాలలో విశాఖపట్నం లో పాస్టర్ జి. డేవిడ్ గారి వంటి దైవ జనులు మరిఒకరు లేనే లేరు , అంతటి గొప్ప సేవకలు . అయన పరిచర్యలో అనేక కుటుంబములు దీవించబడ్డాయి. ఆయన విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో గొప్ప సేవ చేసారు ఆయనతో కలసి మేము అందరం సువార్త చేసేవారము . మా నాన్నగారు కి కూడా సేవ , సువార్త, ఇంకా ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవాలని , పేదవారికి సహాయం చేయాలనీ చాల ఆశ పడేవారు , కానీ అ ఆశ నేరవేర్చకుండానే ప్రభు నందు నిద్రించారు. నేనైతే చిన్ననాటి నుండి సువార్త పట్ల ఆశక్తి చుపేవాడిని . నేను MBA పూర్తి చేయడానికి , ఉద్యోగ నిమిత్తం విదేశాలు వెళ్ళడానికి దేవుడు నాకు ఎంత గానో సహాయం చేసారు , కానీ ఎల్లప్పుడూ నాకు మా తండ్రిగారు ఆశ, కోరిక నెరవేర్చాలి అనే ఆలోచన ఉండేది , అందుకే నేను దుబాయ్ నుండి వచ్చాక BRIGHT MINISTRIES స్తపించడానికి దేవుడు ఆశ్విరిందించారు, తద్వారా అనేక మందికి దేవుని సువార్త అందించాలి అనే ఆశ . అలాగే BRIGHT SCHOOL స్తాపించి అనేక పేద విద్యార్దులకు శిక్షణ ఇవ్వడానికి దేవుడు సహాయం చేసారు . దేవుడు నా వివాహ విషయంలో ఎంతగానో సహకరించి దీవించారు, అలాగే నన్ను నా బార్యను ప్రేమించి మాకు మంచి కుమారుడుని అనుగ్రహించారు. నేను చేస్తున్న మినిస్ట్రీ పనిలో నాటో పాటు నా తల్లి ,నా బార్య ,అక్కలు , బావలు వాళ్ళు కుటుంబాలు మరియు నా యొక్క స్నేహితులు సహకారం, ప్రోత్సాహం ఎంత గానో ఉంది. ఈ అందరి సహకారం పట్ల దేవునికి నేను క్రుతజ్ఞ్యత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను అనేక యవ్వనస్తులు మద్య వాడుకోనుచున్నారు , అయన మహా కృపను బట్టి నేను వాడబడుచున్నాను.అనేక సంఘంలో దేవుడు నన్ను యవ్వనస్తులని నడిపించడానికి వాళ్ళని ఆరాధనలో నడిపించడానికి కృప చూపించారు .దుబాయ్ దేశం లో కూడా దేవుడు నన్ను బలపరిచి అయన సన్నిదిలో వాడబడుటకు సహాయం చేసారు .చాల మంది సేవకలు నన్ను ప్రోత్సహించేవారు , ఇంకా దేవునిలో లోతుగా ఎలా ఎదగాలో నేర్పించారు. దేవుని కొరకు ఏదో చేయాలి అని నా మనసుకు ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది . ఇంకా నేను ఆయనలో ఎల్లప్పుడూ ఎక్కువుగా సాగాలి , అనేకులని ఆయనలో నడిపించాలి అన్నది నా ఆశ .
మీరు అందరు నా కొరకు నా కుటంబం కొరకు ఇంకా నా మినిస్ట్రీ మరియు స్కూల్ అలాగే నేను చేయుచున్న సేవ కార్యక్రమాలు కొరకు మీ యొక్క ప్రార్ధనలలో ప్రార్ధించండి . దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దివెంచును గాక . ఈ యొక్క సాక్ష్యం దేవుడు దివెంచును గాక ..ఆమెన్ ..
No comments:
Post a Comment